కుందుర్పి మండలం మాలయనూరులో మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రకు చెందిన 15కుటుంబాలు గ్రామంలో బొగ్గులు కాల్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విలాస్ కు చెందిన ముగ్గురు పిల్లలతో పాటు మరో పాప మట్టిగుంతలోకి ఆడుకోవడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు.