ప్రధాన రహదారి పక్కనే నిలిచిన వర్షపు నీరు - ఇబ్బందులలో ప్రజలు

కళ్యాణదుర్గం పట్టణంలోని బుట్నా కాంప్లెక్స్ ఎదురుగా ప్రధాన రహదారిపై వర్షపు నీరు నీటి కుంట వలె నిల్వ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని సోమవారం విలేఖరులకు తెలిపారు. ఏపీజీబీ బ్యాంక్, మీసేవ, ఇతర వ్యాపార సముదాయాలు ఈ కాంప్లెక్స్ లోనే ఉన్నాయి. లోపలికి వెళ్లాలంటే మురుగునీటి దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని నీటినిల్వ లేకుండా చూడాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్