కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 27వ తేది దేవర సినిమా విడుదల కానున్న సందర్భంగా.. గురువారం ఎన్టీఆర్ అభిమానులు ప్రధాన సర్కిళ్లలో ద్విచక్ర వాహనాలపై ఎన్టీఆర్ జెండాలను పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణవాసులు అబ్బురు పోయేలా ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించి టీ సర్కిల్ నందు బాణాసంచాను పేల్చారు. ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.