కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే వీధికి చెందిన మహిళలు తాగునీటి కోసం బుధవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల ఆందోళనతో ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు మహిళల ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయితే మహిళలు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.