కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి

రొద్దం మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం 25 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉదయం కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలో సుమారు రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.

సంబంధిత పోస్ట్