శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం పరిధిలోని రొళ్ల మండలానికి ఇటీవల ఎంటీఎస్ ఉపాధ్యాయులకు నిర్వహించిన బదిలీ కౌన్సిలింగ్‌లో భాగంగా 41 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఎంపీపీ, యూపీ, జడ్పీ పాఠశాలల్లో నియమించడం జరిగింది. వీరంతా ఇప్పటికే విధుల్లో చేరినట్లు ఎంఈఓ తెలిపారు. అలాగే, ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఖాళీలను వర్క్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నియామకాలతో మండలంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.