ఎమ్మెల్యేపై మడకశిర పోలీసులకు ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, మడకశిర వైసీపీ నాయకులు చర్యలు తీసుకోవాలని సోమవారం డిమాండ్ చేశారు. నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ ఈర్ల లక్కప్ప నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పంతం నానాజీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్