పోలియో చుక్కల పంపిణీ: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆదేశాలు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని సాయి నగర్ ఎనిమిదవ అంగన్వాడీ సెంటర్లో ఆదివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిల ఆదేశాల మేరకు 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనిత, కార్యకర్త సంగీత, వైద్య ఆరోగ్య అధికారులు, కాపు రామాంజనేయులు పాల్గొన్నారు. చిన్నపిల్లలకు ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించి, ఆరోగ్యకరమైన జీవితం అందించడానికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్