రొళ్లను కరువు మండలంగా ప్రకటించాలి: రైతుల డిమాండ్

రొళ్ల మండల కేంద్రంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టనున్నారు. రొళ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించనుంది. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జడ్పీటీసీ అనంతరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕