మడకశిర మండలం మొలవాయి గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గోవిందరెడ్డి బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే, రాష్ట్ర కుంచిటిగా ఒక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, గుండుమల మాజీ సర్పంచ్ చంద్రప్ప గోవిందరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.