అమరాపురం మండలం కేంకెరలో శుక్రవారం నరసింహప్ప అనే రైతుకు చెందిన గుడిసెకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆరు మేకలు, నిత్యావసర సరుకులు కాలి బూడిదయ్యాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో నరసింహప్ప నిత్యావసర సరుకుల కోసం గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనతో రైతుకు లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.