మడకశిర మున్సిపల్ పరిధిలో ₹2. 5 కోట్లతో చేపట్టిన పలు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. యాదవ కాలనీ, శివపురం, మారుతి నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు రైతు బజార్‌కు భూమిపూజ, సులభ్ కాంప్లెక్స్ ప్రారంభం నిర్వహించారు. అంతకుముందు 2, 000కు పైగా ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.