జమ్మలబండ పాఠశాల కమిటీ ఎన్నిక

గుడిబండ మండలం పరిధిలోని జమ్మలబండ గ్రామపంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో మహిళను చైర్మన్‌గా, తెలుగు ప్రభ రిపోర్టర్ గోవిందరాజును వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనాథ్ మూర్తి, బూదిపల్లి జయరాం, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కరియప్ప, బంగి భగవాన్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕