మడకశిర మండలం సి.కోడిగేపల్లి సచివాలయ విద్యుత్ లైన్‌మెన్ రామాంజనేయులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ పారిశ్రామికవేత్త ఫాం ల్యాండ్‌కు అనధికారికంగా స్తంభాలు మార్చడం, మరోచోటుకు 33 స్తంభాలు తరలించడంపై రైతులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన విద్యుత్ శాఖ ఏడీ రఘు, నిబంధనలు ఉల్లంఘించినందుకు లైన్‌మెన్‌పై చర్యలు తీసుకున్నట్లు, అక్రమాలకు పాల్పడటం వల్లే సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు.