మడకశిర : విగ్రహ ప్రతిష్టపన ఉత్సవంలో మాజీ ఎమ్మెల్సీ

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ పరిధిలోని బేగార్లపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులను కలిసి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం విజయవంతం కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్