శుక్రవారం మడకశిర పట్టణ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో నరసయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నరసయ్య, జగన్ అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని ఐడి పల్లి గ్రామం నుండి మడకశిర వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నరసయ్య అక్కడికక్కడే మృతి చెందగా, జగన్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని కర్ణాటకకు తరలించారు.