రోళ్లలో అదృశ్యమైన మహిళ, పిల్లల ఆచూకీ లభ్యం

సత్యసాయి జిల్లా రోళ్ల మండలం హెచ్లో వడ్రహట్టిలో నలుగురు అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మీ అనే మహిళ తన తల్లి సుబ్బమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి కర్ణాటకలోని ఎల్లంపురం వెళ్లినట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందడంతో, పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వెంటనే చర్యలు చేపట్టారు. ఎవరికీ చెప్పకుండా వెళ్లిన వారిని సురక్షితంగా గుర్తించి రోళ్లకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్