పోలియో చుక్కలు తప్పనిసరి: ఏఎన్ఎం అనిత

మడకశిర పట్టణంలోని అదివారం సాయి నగర్ ఎనిమిదవ అంగన్వాడి స్కూల్లో చిన్నారులకు 'నిండు జీవితానికి రెండు చుక్కలు' వేయించాలని ఏఎన్ఎం అనిత తెలిపారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం అనిత, అంగన్వాడి కార్యకర్త సంగీత మాట్లాడుతూ, పోలియో లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఈ కార్యక్రమం కీలకమని, ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్