రొళ్ల : పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ శ్రీధర్

శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ శ్రీధర్ బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, తల్లిదండ్రులకు అమరావతి నుండి IVRS ద్వారా వస్తున్న కాల్స్ నేపథ్యంలో పిల్లల ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆహారం మెనూ ప్రకారం, రుచికరంగా ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు, ఏజెన్సీ వారికి సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్