ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలి: గోవిందరాజు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే మంజూరు చేసి, నిధులను విడుదల చేయాలని శనివారం గుడిబండ మండల మాల మహానాడు ప్రధాన కార్యదర్శి గోవిందరాజు డిమాండ్ చేశారు. రుణాల కోసం ఎదురుచూస్తున్న పేద ఎస్సీ కుటుంబాలకు, యువతకు ప్రభుత్వం త్వరగా న్యాయం చేయాలని, దరఖాస్తులను వేగంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕