రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి

శుక్రవారం ఉదయం మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. పూణే నుంచి పెనుకొండ వైపునకు వెళ్తున్న ఐచర్ వాహనం, హిందూపురం నుంచి వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్