అగళిని కరవు మండలంగా ప్రకటించాలని వైసీపీ ధర్నా

సత్య సాయి జిల్లా అగళి మండలాన్ని వెంటనే కరవు మండలంగా ప్రకటించాలని వైసీపీ మడకశిర సమన్వయ కర్త ఈర లక్కప్ప, కన్వినర్ స్టూడియో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వర్షాభావం, ఎల్ నీనో పరిస్థితి కారణంగా వర్షం లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య ఏర్పడిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించి ఆదుకోవాలని తహసీల్దార్ హరికుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕