శనివారం రాత్రి అమరాపురం మండలం హలుకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్నడుకు గ్రామానికి చెందిన సురేశ్ (35) అనే యువకుడు దుర్మరణం చెందాడు. బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు.