మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం కొంకల్లు గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ పంచాయతీ కన్వీనర్ మహాలింగప్ప ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం మడకశిర టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చేతుల మీదుగా ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహాలింగప్పకు పలువురు టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు.