అగళి లో ఉలవలు పంపిణీ చేసిన జడ్పీటీసీ

శ్రీ సత్యసాయి జిల్లా అగళిలో 80% రాయితీతో ఉలవల పంపిణీ కార్యక్రమం ప్రజాప్రతినిధుల సమక్షంలో బుధవారం ప్రారంభమైంది. అగళి మండలానికి 300 క్వింటాళ్ల ఉలవలు వచ్చాయి. రైతు సేవ కేంద్రాలలో పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 10 కేజీల బస్తా పూర్తి ధర 740 రూపాయలు కాగా, 80% రాయితీతో రైతు వాటా 148 రూపాయలు మాత్రమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగరాజు, జడ్పీటీసీ ఉమేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివరాం తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕