అనంత: రేపు జవాన్ అంత్యక్రియల్లో పాల్గొననున్న హోం మంత్రి

జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలకు హోంమంత్రి వంగలపూడి అనిత హాజరుకానున్నారు. శనివారం అయన భౌతికకాయం ఇంటికి చేరుకోనుంది. గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. పాక్ జరిపిన కాల్పుల్లో మరణించిన నేపథ్యంలో అధికారిక, సైనిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు హోంమంత్రి అనిత హాజరై మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళి అర్పించనున్నారు.

సంబంధిత పోస్ట్