మంచేపల్లిలో కేంద్ర ప్రభుత్వ VBG-RAM-G పథకం ప్రారంభం

సోమందేపల్లి మండలం పందిపర్తి పంచాయతీ పరిధిలోని మంచేపల్లి గ్రామంలో గురువారం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన VBG-RAM-G పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం శ్రామికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. పథకం లక్ష్యాలు, గ్రామీణాభివృద్ధిలో దీని ప్రాధాన్యం, ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్