సిమెంట్ రోడ్డు కోసం ఉపయోగించిన మిల్లర్ కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గాండ్లపెంట మండలం జీనులకుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. జీనులకుంట గ్రామంలో సిమెంట్ రోడ్డు కోసం ఉపయోగించిన మిల్లర్ యంత్రం వెనక్కి రావడంతో వెనకవైపు ఉన్న అదే గ్రామానికి చెందిన వేమన్న (75) మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసిన పోలీసులు.