గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధి కల్లీ తండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ మురళీ నాయక్ తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడుతూ ఘటన బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.