శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోరంట్ల మండలంలోని ఎగువ గంగంపల్లి పంచాయతీ దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం ఉదయం పిడుగు పడి దశరత్ నాయక్, అతని భార్య దేవి బాయి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఆదివారం పిడుగు పాటుతో భార్య, భర్త మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో పుట్టపర్తి కి తరలించారు. రెండు ఆవులు అక్కడిక్కడే మృతి చెందాయి.