గోరంట్ల పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన నిందితుల నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. దొంగలను పట్టుకున్న గోరంట్ల సీఐ, సిబ్బందిని ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు.