పెనుగొండ: స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణ శివారులోని గొర్రెల పెంపకం క్షేత్రం సమీపంలో శనివారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనంతపురానికి చెందిన విజయ్ కుమార్ (55) అనే వంటమనిషి, బృందావనం వద్ద వంట పని నిమిత్తం వచ్చి, స్నానం చేయడానికి బావిలోకి దిగి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్