పెనుగొండ పట్టణంలో శనివారం శివ మాలలో వున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసులు దాడి పట్ల దాదు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన ఆదివారం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను హిoదూ సోదరులకు వ్యతిరేకం కాదని శివమాల ధరించిన వ్యక్తి ఆటోకు.. తన కార్ డోర్ తగిలిందని ఆ విషయంలో స్వామికి తనకు గొడవ జరిగిందని వీడియోలో స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఆ ఘటన పరస్పర దాడికి దారి తీసిందన్నారు.