రొద్దం: తెగిన చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామం చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండు కుండను తలపిస్తోంది. చెరువు కట్ట మీద ఉన్న 50 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలడంతో, చెరువు కట్ట పాక్షికంగా దెబ్బతింది. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. శనివారం మంత్రి సవిత ఆదేశాల మేరకు అధికారులు, టీడీపీ నాయకులు మాధవనాయుడు తెగిన తురకలాపట్నం చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్