చేనేత కార్మికులకు ట్రెండ్ కు తగ్గట్టు శిక్షణిచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత ఔళి శాఖ ఎస్. సవిత తెలిపారు. గురువారం ఆమె మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాలను సందర్శించారు. మగ్గాలు ఏర్పాటు, స్టోర్ రూమ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, సేల్స్ కౌంటర్లను మంత్రి పరిశీలించారు. 20 స్టాండ్ లూమ్స్, జాక్ మిషన్ల పనితీరును తిలకించారు.