అక్రమ సంబంధం పెట్టుకొని భర్త వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు

కొత్తచెరువులోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మీనాక్షి, తన భర్త శ్రీనివాసులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని సీఐ మారుతి శంకర్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తనపై దాడి చేసి గాయపరిచాడని, వేరే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై గృహహింస కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్