ఓడి చెరువు మండలం, అల్లపల్లిలో జూలై 3న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సహకార వార్షికోత్సవాల సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘం చైర్మన్ బోయపల్లి బొల్లం శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి 35 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంకు CEO రామాంజనేయులు, సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.