పుట్టపర్తిలో సోమవారం రాయలవారిపల్లి గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.