పుట్టపర్తి నుంచి బెంగళూరుకు ప్రతిరోజూ నడిచే కేఎస్ఆర్టీసీ బస్సు బుధవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో స్టార్ట్ కాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులు బస్సును తోయడంతో అది స్టార్ట్ అయింది. అనంతరం బస్సు బెంగళూరుకు బయలుదేరి వెళ్లింది.