ఓబుల దేవర చెరువు: ప్రమాదంలో వ్యక్తి మృతి

ఓబుల దేవర చెరువు మండలంలోని బొమ్మిరెడ్డి చెరువు సమీపంలో శనివారం బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడినట్లు స్థానికులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు కమ్మవారి పలికి చెందిన సురేంద్రనాయుడు (58)గా గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పని నిమిత్తం ఓబుల దేవర చెరువుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు.

సంబంధిత పోస్ట్