పుట్టపర్తి పట్టణం వివేకానంద నగర్ కు చెందిన వెంకటనారాయణ (38) అనే వ్యక్తి తాగుడుకు బానిసై అనారోగ్య కారణాలతో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు తాగుడుకు బానిసైనా వెంకటనారాయణ అనారోగ్యంతో అనంతపురంలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చాడని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.