పుట్టపర్తి: కేకు తిని పది మందికి అస్వస్థత

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లి రహదారిలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా కేకు కోసుకున్నారు. కొత్తచెరువులోని ఓ బేకరి నుంచి తెచ్చిన ఈ కేకును తిన్న పది మంది అస్వస్థతకు గురయ్యారు. కేకు తిన్న వెంటనే వాంతులు కావడంతో వారిని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. వీరితో పాటు కేకు తిన్న మరో 40 మందికి కూడా వైద్యసేవలందించారు. అస్వస్థతకు గురైన పది మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆర్డీవో, డీఎస్పీ ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా బాధితుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్