ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఖండించారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా పత్రికను, ఛానల్‌ను ముందుకు తీసుకుపోతూ జర్నలిజంలో ముద్ర వేసుకున్నారన్నారు.