రాప్తాడు: పల్లె పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

కనగానపల్లి మండలం దాదులూరు, చంద్ర చెర్ల గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రూ. 41 లక్షల నిధులతో మంజూరైన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్