పేద విద్యార్థులకు విద్యా సహాయం: దాతల చేయూత

శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి మండలం, మేడాపురం గ్రామానికి చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన లోకేష్, లేఖ్య అనే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు వెళ్లలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న నామాల గాండ్ల శ్రీనివాసులు, బెంగళూరు అరుణ్ కుమార్, ఆర్&బి నాగరాజు ముందుకు వచ్చి, వారి వంతుగా విద్యార్థులకు విద్యా సహాయం అందించారు. స్కూల్ ఫీజుతో పాటు విద్యా సామగ్రి, యూనిఫామ్ కూడా అందజేశారు. ఈ సహాయాన్ని అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్