గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స

అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, సి కె పల్లి సమీపంలో ఎన్ ఎస్ గేట్ వద్ద శుక్రవారం హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 60 ఏళ్ల వయసున్న మతిస్థిమితం లేని వృద్ధురాలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరగడంతో 108 ద్వారా సి కె పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించాల్సి ఉన్నా, అటెండర్ లేకపోవడంతో అక్కడే చికిత్స పొందుతున్నారు. గాయపడిన వృద్ధురాలిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕