పెనుగొండ మండలం కియా పోలీస్ స్టేషన్ పరిధిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనం AP 39WB 0388 ను కియా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బియ్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల ద్వారా పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ సంఘటన అనంతపురం, రాప్తాడు ప్రాంతంలో చోటుచేసుకుంది.