రాప్తాడు మండలం గంగలకుంటలో పొలం తగాదా గొడవ లో మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గంగుల కుంట గ్రామంలో ఒక పొలం తగాదా విషయం లో గత కొద్ది రోజులుగా ఇరు వర్గాలు మధ్య ఘర్షణ పడుతున్నాయి. నేడు ఇరు వర్గాలు పెద్ద స్థాయిలో గొడవ పడి కొట్టుకోవటం తో ఒక వర్గం లోని మహిళకు తీవ్ర గాయాలు అవ్వటం తో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్నారు.