రాప్తాడు: కక్కలపల్లి లో తగ్గిన టమాటా దిగుబడి, కిలో రూ. 55

జిల్లాలో టమాటా దిగుబడి తగ్గింది. అనంతపురం గ్రామీణ పరిధి కక్కలపల్లి మార్కెట్లోని అన్ని మండీలకు కలిపి 225 టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. దసరా పండుగ నేపథ్యంలో రైతులు మార్కెట్ కు తీసుకురానట్లు తెలుస్తోంది. కాగా మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ. 55తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ సోమవారం తెలిపారు. కిలో సరాసరి ధర రూ. 44, కనిష్ఠ ధర రూ. 36 పలికినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్