సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని గాండ్లవారిపల్లెలో మోహరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయాన్నే పీర్ల స్వాములను వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వాముల ముందు మోకరిల్లగా, వారి కోరికలు తీర్చేందుకు స్వాములు చెవిలో చెప్పినట్లు తెలిపారు. అనంతరం, పీర్ల స్వాములు గుండం చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నిగుండంలో ప్రవేశించారు. సాయంత్రం స్వాములను ముల్లా సాబులు, పకీర్లు, గ్రామస్తులు జల్దికి తీసుకెళ్లారు. వేడుకలను చూసేందుకు వచ్చిన భక్తులకు గ్రామస్తులు అన్నదానం చేపట్టారు.